వాన నీటిని ఒడిసి పట్టాలి


Mon,August 19, 2019 12:07 AM

-ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
-నీటి వనరులను సంరక్షించాలి
-కందకాలు తవ్వి నీటి నిల్వలు చేయాలి
-చెట్లు ఎక్కువగా ఉంటేనే వర్షాలు
-జలశకి ్తఅభియాన్ కేంద్రం సభ్యులు
సిద్దిపేట అర్బన్: భూమిపై పడిన ప్రతి వాన చినుకును ఒడిసి పట్టాలని జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యుడు నీరజ్ బట్నాకర్ సూచించారు. భూగర్భజలాలు పెరుగాలంటే నీటిని నిల్వ చేసుకునేలా పెద్ద ఎత్తున కందకాలు తవ్వి ఎక్కడి నీటిని అక్కడే నిల్వ చేసుకోవాలన్నారు. సిద్దిపేట అర్బన్ మండ లంలోని మిట్టపల్లి గ్రామాన్ని ఆదివారం సెంట్రల్ టీం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులకు ఎం పీపీ వంగ సవితాప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, ఉపాధి కూలీలు స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా మిట్టపల్లిలో ఉద్యమంగా చేపడుతున్న హరితహారం పనులతోపాటు మొక్కలు నాటే విధానాన్ని పరిశీలించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపారు. నీటి నిల్వలను ఉన్న ప్రదేశాల్లోనే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కందకాలను తవ్వడం వలన నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జలశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భూగర్భజలాలు పెరుగడానికి, నీటి వనరుల సంరక్షణ ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. కందకాలను తవ్వించడం, మొక్కలను నాటడం, నీటి నిల్వలను పెంచడం ఇతర చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏవిధంగా ఉన్నాయి? నీటి సమస్య ఉందా? అని మిట్టపల్లిలో అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు వస్తున్నాయని, రైతాంగానికి నీటి సమస్య ఉందని స్థానికులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగలక్ష్మి, ఉప సర్పంచ్ సంతోశ్‌యాదవ్, ఉపాధి ఏపీవో నర్సింగారావు, లైజన్ ఆఫీసర్ పాల్గొన్నారు.
గ్రామాల్లో జలశక్తి అభియాన్ బృందం పర్యటన
సిద్దిపేట రూరల్: జలశక్తి అభియాన్‌లో భాగంగా మండలంలోని బుస్సాపూర్, తోర్నాల గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర జలశక్తి అభియాన్ టెక్నికల్ అధికారి భట్నాగర్ నేతృత్వంలోని సభ్యులు బుస్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సామూహిక, వ్యక్తిగత ఇంకుడు గుంతలను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు. అనంతరం తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నిర్మించిన పాంపాండ్స్ పరిశీలించి, వాటినిండా నీరు ఉండడంతో సంతో షం వ్యక్తం చేశారు. ఫారెస్ట్‌లోని కాంటూర్ కందకాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి, సర్పంచ్‌లు సదాశివరెడ్డి, దేవయ్య పాల్గొన్నారు.
నీటి కందకాలు, పాంపాండ్స్ పరిశీలన
దుబ్బాక, నమస్తే తెలంగాణ : దుబ్బాక మండలం ఎనగుర్తి లో జలశక్తి అభియన్‌లో భాగంగా డా.సెంథిల్‌కుమార్ బృందం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి వనరులను పెంపొందించేందుకు తీసిన కమ్యూనిటీ సోప్ పిట్, బోర్ రీఛార్జి ఫిట్, పాంపాండ్, ప్లాంటేషన్లు పరిశీలించారు. నీటి వనరులను పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, సర్పంచ్ శంకర్, ఏపీవో పద్మ, కార్యదర్శి శృతి, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...