ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి


Mon,August 19, 2019 12:06 AM

హత్నూర: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఆదివారం మండలంలోని దేవులపల్లి, దౌల్తాబాద్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడజన హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాపన్న ఎంతో కృషి చేశాడని కొనియాడారు. అదే విధంగా ప్రభుత్వం పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టి జయంతిని ప్రభుత్వం జరిపించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు దుర్గంగౌడ్, వీరేశంగౌడ్, మండల నాయకులు రంగాగౌడ్, కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, కృష్ణగౌడ్, నరేందర్‌గౌడ్, పరమేశ్‌గౌడ్, యాదాగౌడ్, దత్తాగౌడ్, రామస్వామిగౌడ్ పాల్గొన్నారు.
అందోల్ రూరర్‌లో..
అందోల్ రూరల్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు, సర్పంచ్ లింగాగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని తాలెల్మలో సర్వాయి పాపన్నగౌడ్ 369వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మాణిక్యం గౌడ్, ప్రతాప్‌గౌడ్, ప్రసాద్ గౌడ్, నాగరాజ్ గౌడ్, మల్లేశం గౌడ్, నారాయణమూర్తి గౌడ్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...