బోనాల పండుగ తెలంగాణ ప్రత్యేకం


Mon,August 19, 2019 12:06 AM

జిన్నారం: బోనాలకు తెలంగాణ ప్రాంతం పెట్టింది పేరని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం వావిలాలలో జరిగిన శ్రావణమాస బోనాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వావిలాలలో ఎంపీపీ రవీందర్‌గౌడ్, సర్పంచ్ సుశాంతి, మాజీ సర్పంచ్ రవీందర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు చాలా ప్రత్యేకమైనవన్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణ సంస్కృతిని అందరం కాపాడుకోవాలన్నారు. అనంతరం సర్పంచ్‌లు ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను శాలువా, పూలమాలతో సన్మానించారు. కాగా ఖాజీపల్లిలో గ్రామస్తులు బోనాలను ఘనంగా జరిగింది. సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మమతానవీన్ కుమార్, ఎంపీటీసీ భార్గవ్ గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవనీత్‌రెడ్డి, అశోక్, బీమా, కరుణాకరగ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...