ఘనంగా ఐదుగుళ్ల పోచమ్మ బోనాలు


Mon,August 19, 2019 12:06 AM

-అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రామచంద్రాపురం: ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో, ఎస్సీబస్తీలో, బండ్లగూడ మార్క్స్‌నగర్‌కాలనీలో శ్రావణ మాసం బోనాలను ఆదివారం ఘనంగా జరిగాయి. పోచమ్మ ఆలయానికి రంగులు వేసి, పువ్వులతో ముస్తాబు చేసి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆయా ప్రాంతాల్లో బోనాల సందర్భంగా మహిళల బోనాల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. సాయంత్రం యువకులు పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపులను నిర్వహించారు. మహిళలు సిరస్సుపై బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. బోనాలల్లో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ అంజయ్యయాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుష్పానగేశ్‌లు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బండ్లగూడ మార్క్స్‌నగర్ కాలనీలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, టీఆర్‌ఎస్ నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను అమ్మవారు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రముఖులను సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, బూరుగడ్డ నగేశ్, మల్లేశ్‌యాదవ్, ఐల్లేశ్‌యాదవ్, కృష్ణకాంత్, కృష్ణమూర్తి, సత్యనారాయణ, నర్సింగ్‌రావు, బీకే యాదయ్య, ప్రమోద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...