అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి


Mon,August 19, 2019 12:06 AM

పుల్కల్: ఇంట్లో నుంచి మూడ్రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి ఆదివారం శవమై కనిపించాడు. మండల పరిధిలోని సింగూర్ గ్రామానికి చెందిన మన్నె పవన్ కుమార్ (31) పోసానిపల్లి గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఎస్‌ఐ ప్రసాద్‌రావు తెలిపిన కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన మన్నె పవన్ కుమార్ వృత్తి రీత్యా కేబుల్ ఆపరేటర్. ఈ నెల 16న అత్తగారి ఊరు పోసాన్‌పల్లికి వెళ్లి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణం అయ్యాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్ రావడంతో అనుమానంతో శనివారం మృతుడి తండ్రి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పోసానిపల్లి శివారులో రోడ్డు పక్కన గుంతలో దుర్వాసన రావడంతో గ్రామ సర్పంచ్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ ప్రసాద్‌రావు తన బృందంతో వెళ్లి చూడగా మూడు రోజుల క్రితం అదృశ్యమైన సింగూరుకు చెందిన పవన్‌కుమార్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో క్లూస్‌టీమ్, డాగ్ స్వాడ్‌ను రప్పించారు. క్లూస్ టీమ్ సీఐ రాజేందర్ వివరాలు సేకరించగా డాగ్ స్కాడ్ ఇన్‌స్పెక్టర్ జీవన్ ఘటన స్థలంలో వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం సంగారెడ్డి దవాఖానకు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...