డబుల్ వేగం


Sat,August 17, 2019 11:15 PM

-జిల్లాలో 5,555 ఇండ్లు మంజూరు
-నిర్మాణానికి రూ.114.89 కోట్ల నిధులు మంజూరు
-200 డబుల్ బెడ్‌రూం నివాసాలు పూర్తి
-నియోజకవర్గానికి 1400 చొప్పున కేటాయింపు
-రెండు శాఖలకు నిర్మాణ పనులను అప్పగించిన ప్రభుత్వం
-త్వరలో కొత్త ఇండ్లలో ప్రవేశించనున్న లబ్ధిదారులు

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం పేదలకు పక్కా ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చేందుకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రతిపేదవారు నివాసయోగ్యమైన ఇండ్లలో ఉండేందుకు సీఎం కేసీఆర్ రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,555 ఇండ్ల నిర్మాణాలను మంజూరు చేసి రూ.114.89 కోట్ల నిధులను విడుదల చేసింది. మంజూరైన ఇండ్లలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఇండ్లు 5,355 కాగా 4,616 ఇండ్ల నిర్మాణాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఇండ్లకు స్థలాలను సేకరించి నిర్మాణ పనులను చేపట్టారు. జిల్లాలో 200 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, త్వరలో అధికారులు లబ్ధిదారులకు అందించనున్నారు. మిగతా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్‌రూం ఇండ్ల చొప్పున కేటాయించారు.

ఇప్పటికే సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలకు 1400 చొప్పున మంజూరు చేసి రూ. 66.36 కోట్లను కేటాయించింది. నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు గ్రామాలకు ఒక చోట పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాగానే అర్హులను గుర్తించి లబ్ధిదారులు ఇండ్లలో ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం రహదారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ శాఖలకు నిర్మాణాల బాధ్యతలు అప్పగించింది. త్వరలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తి చేసుకుని పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసుకోనున్నారు.

ఆర్‌అండ్‌బీ నిర్మాణాలు వేగవంతం..
రోడ్లు, భవనాల శాఖ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు దృష్టి సారించింది. ఈ శాఖకు సంగారెడ్డి నియోజకవర్గంలోని 1400 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఇందుకోసం ప్రభుత్వం రూ. 37.45 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో కొండాపూర్ మండలం అలియాబాద్‌లో 50, సదాశివపేట మండలం సిద్దాపూర్‌లో 100, పంచాయతీ రాజ్ శాఖ కల్హేర్ మండలం బాచేపల్లిలో 50ఇండ్లు పూర్తి చేశారు. మిగతా ఇండ్ల నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తూ నిర్మాణాల వేగం పెంచారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 130 ఇండ్ల నిర్మాణాలకు స్థల సేకరణ జరుగలేదని, ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతున్నారు.

నిర్మాణ దశలో ఉన్న 4,616 ఇండ్లు..
జిల్లాలో 4,616 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. స్లాబ్‌లేవల్ పూర్తిచేసుకుని ప్లాస్టింగ్ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. 2015,16 ఏడాదిలో 1800 ఇండ్లు మంజూరు చేయగా, 1700 ఇండ్లను ఎంపిక చేసి 1540 ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 2016-17లో 3,755 ఇండ్లను మం జూరు చేయగా, 3,655 ఇండ్లను ఎంపిక చేసి 3,076 ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...