20న సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన


Sat,August 17, 2019 11:08 PM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలో నిర్వహించే 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా పరిశుభ్రత-ఆరోగ్యకరమైన దేశం కోసం నూతన సాంకేతిక ఆవిష్కరణలు అనే అంశంపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నెల 20న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు. బైపాస్‌రోడ్డులోని జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించే ఈ సదస్సుకు ప్రతి పాఠశాల నుంచి ఒక సైన్స్ ఉపాధ్యాయుడు హాజరయ్యే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, కేజీబీవీ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వేతర గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...