బాలల హక్కులను పరిరక్షించాలి


Sat,August 17, 2019 11:07 PM

సంగారెడ్డి టౌన్ : బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ నాగార్జున్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా జైల్ మ్యూజియం సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిత ప్లాన్ ఇండియా, మెడ్వాన్ సహకారంతో జిల్లాస్థాయి బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, వృత్తి విద్యా శిక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలల హక్కులకు భంగం కలిగిన, బాల్య వివాహాలు జరిగిన, బాలలను హించించిన 1098 నెంబర్‌కు ఫోన్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎండీఐఎఫ్ అధ్యక్షుడు వెంకటేశం, మెడ్వాన్ సభ్యులు శశ్వంత్, అరవింద్, యాదగిరి, పావని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...