కౌలంపేట వేంకటేశ్వరాలయంలో చోరీ


Sat,August 17, 2019 11:07 PM

-మైక్‌సెట్, ఇతర సామగ్రి ఎత్తుకెళ్లిన దుండగులు
-చెట్ల పొదల్లో పడేసిన బీరువా
కంది : మండలంలోని జాతీయ రహదారి వెంట ఉన్న కౌలంపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ అర్చకుడు జయంత్‌శర్మ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం ఉదయం రోజూ వారీలాగే స్వామివారికి పూజ చేయడం కోసం ఆలయానికి వచ్చాను. అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు గేటుకు ఉన్న తాళం పగులకొట్టి ఆలయంలోని బీరువాలో ఉన్న సామగ్రిని దొంగలించారు. ఆ బీరువా పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేసి ఉంది. బీరువాలో ఉన్న మైక్‌సెట్‌తోపాటు పూజకు ఉపయోగించే వస్తువులు, ఇతర సామగ్రిని దొంగిలించారు. గతంలో కూడా ఆలయం గేటు పగులగొట్టి హుండీలో ఉన్న డబ్బును చోరీ చేశారని అర్చకుడు తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుని, దొంగలను గుర్తించి వారిని శిక్షించాలని ఆయన కోరారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...