సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని విజయవంతం చేయాలి


Sat,August 17, 2019 11:07 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : తెలంగాణలో తొలి పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని, ఈ నెల 18న ఆయన జయంతి వేడుకలను విజయవంతం చేయాలని గౌడ కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజుగౌడ్ కోరారు. శనివారం సంగారెడ్డిలోని ఆ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి జయంతి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వేడుకలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామని, ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ హాజరవుతున్నారని తెలిపారు.

జిల్లాలోని కల్లుగీత కార్మికులు, గౌడలు, సొసైటీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మనోహర్‌గౌడ్, వీరేశంగౌడ్, డాక్టర్ రాజుగౌడ్, ఆశన్నగౌడ్, రమేశ్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, బందెన్నగౌడ్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...