ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలి


Sat,August 17, 2019 11:06 PM

-ఎంపీపీ మనోజ్‌రెడ్డి
కొండాపూర్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కొండాపూర్ ఎంపీపీ పట్లోళ్ల మనోజ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎంపీడీవో స్వప్నతో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం నాటే మొక్కలే రేపటి తరాలను బతికిస్తాయని, కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కను నాటి సంరక్షించుకోవాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా, పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవాలన్నా మొక్కల పెంపకం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మమతాగోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మాణయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ మాణిక్యంగౌడ్, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మయ్యయాదవ్, ఉప సర్పంచ్ మల్లేశం, పంచాయతీ కార్యదర్శి సందీప్‌గౌడ్, ఉపాధ్యాయులు విఠల్, భుమయ్య, చంద్రమోహన్, వెంకటేశ్వరీ పాల్గొన్నారు.

కలబ్‌గూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో..
కంది : సంగారెడ్డి మండల పరిధిలోని కలబ్‌గూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల సభను నిర్వహించారు. శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుల జగదీశ్వర్ ఆధ్వర్యంలో బాల సభతోపాటు హరితహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాల సభలో మాట్లాడుతూ మొక్కల పెంపకం వలన కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కోరుతూ గ్రామ వీధుల్లో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పోతిరెడ్డిపల్లి పాఠశాలలో..
కంది/సంగారెడ్డి చౌరస్తా : సంగారెడ్డి మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో హరితహారం నిర్వహించారు. శనివారం మాజీ సర్పంచ్ సుమంగళి పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చేపడుతున్న హరితహారంలో పాల్గొని తమవంతుగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోధ్యాయుడు జాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు మదన్‌గోపాల్, నాగేశం, సునీత, లావణ్య, ప్రవీణ, శ్రీదేవి, నయీం, మహిళా సంఘాల ప్రతినిధులు రాజేశ్వరి, పరిశోధన, సీఆర్పీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...