డిజిటల్ పాసు పుస్తకాలు పంపిణీ


Sat,August 17, 2019 11:06 PM

-ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్
ప్రభుత్వం రైతుల భూ సమస్యలు పరిష్కరించి కొత్తగా డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ తెలిపారు. కోర్టు కేసులతో ఎంతో మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదన్నారు. దీంతో సీఎం కేసీఆర్ రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేశామన్నారు. ప్రభుత్వం సర్వే చేసి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వరాదన్నారు.

హోతి(బి) గ్రామంలో 150 మంది రైతులకు ఒకే రోజు పట్టాదారు పాసు పుస్తకాలు అందించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హరిత హారంలో ఐదు మొక్కలు నాటి సంరక్షణ చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ తాసిల్దార్ సుబ్రహ్మణం, ఆర్‌ఐ. నందకిశోర్, వీఆర్వో సంజీవ్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు విజయ్‌కుమార్, మాణెమ్మ, మచ్చందర్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...