వీరభద్రుడి సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు


Sat,August 17, 2019 11:04 PM

-స్వామి వారికి అభిషేకాలు, భద్రకాళీమాతకు కుంకుమార్చనలు
గుమ్మడిదల: జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దంపతులు శ్రావణ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం మండలంలోని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి,సతీమణి యాదమ్మ దంపతులు సందర్శించారు. వీరికి అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, ధర్మకర్తలు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

వీరభద్రస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే భద్రకాళీ అమ్మవారి వద్ద ఎమ్మెల్యే దంపతులతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ దంపతులు, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్, సర్పంచ్ మమతావేణు తదితరులు కలిసి అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు ఈవో శశిధర్‌గుప్తా, ధర్మకర్తలు శాలువా, పూలమాలలతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...