బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవు


Sat,August 17, 2019 11:03 PM

హత్నూర: బాల్యవివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మంజీరా రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. శనివారం మండలంలోని కాసాల ప్రభుత్వ పాఠశాలలో ప్లాన్ ఇండియా, మహిళా సంస్థ సహకారంతో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో 18సంవత్సరాలు అమ్మాయికి, 21సంవత్సరాలు అబ్బాయికి నిండిన తరువాతనే వివాహం చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

కాగా గ్రామాల్లో బాల్యవివాహాలు చేస్తే చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్‌కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణిరాంరెడ్డి, ఉప సర్పంచ్ స్వప్న, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేశంగుప్తా, కోఆప్షన్ సభ్యుడు రవూఫ్, ఏఎస్‌ఐ సత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్ ప్రతాప్, యువజన అధ్యక్షుడు శ్రీశైలం, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...