సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Sat,August 17, 2019 10:42 PM

అక్కన్నపేట : మండలంలోని కపూర్‌నాయక్‌తండా పం చాయతీలోని కపూర్‌నాయక్‌తండాలో శనివారం అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళికృష్ణ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 110 మంది గిరిజనలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించి, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోశ్‌నాయక్, వైద్యసిబ్బంది శ్రీనివాస్, వినీత్, ప్రేమలత, విజయ, కొమురయ్య, లిల్లీమేరీ, మంజుల, సత్యవతి, సంగీత, రమ ఉన్నారు.

గుగ్గిళ్లలో ఉచిత వైద్య శిబిరం
బెజ్జంకి : మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్యశిబిరం నిర్వహించారు. ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. కార్యక్రమం లో సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పం చ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ భూమయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...