ఇన్‌చార్జి డీటీసీగా శివలింగయ్య


Fri,August 16, 2019 10:52 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : రవాణాశాఖ జిల్లా అధికారిగా శివలింగయ్య ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం కంది మండల కేంద్రం పరిధిలో ఉన్న రవాణాశాఖ కార్యాలయంలో నిజామాబాద్ నుంచి బదిలీపై వచ్చిన శివలింగయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన వెంకరమణ బాధ్యతలు అప్పగించారు. నూతనంగా రవాణాశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలను మర్యాద పూర్వకంగా వారి కార్యాలయాల్లో కలిశారు. జిల్లా రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా చార్జీ తీసుకున్న శివలింగయ్యను ఉద్యోగులు, సిబ్బంది ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. డీటీసీని కలిసిన వారిలో డాక్టర్లు శివారెడ్డి శేరి, నరసింహస్వామి, డి. మహేందర్, కె.రమణమూర్తి తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...