రేపు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక


Fri,August 16, 2019 10:51 PM

నారాయణఖేడ్ టౌన్ : ఈ నెల 18వ తేదీన శ్రీచంద్రారెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అండర్ 23 పురుషులు, మహిళ రెజ్లర్స్‌లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజాబిన్ ఉమర్, జాఫర్‌బాయ్, రెజ్లింగ్ కోట్ జైపాల్ శుక్రవారం తెలిపారు. పోటీల్లో పాల్గొనే రెజ్లర్స్ 1996 నుంచి 2001 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. సంగారెడ్డిలోని డీబీఆర్‌ఏ స్టేడియంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన రెజ్లర్స్‌లను ఈ నెల 22న హైదరాబాద్‌లో పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు తీసుకొని పూర్తి వివరాలను ఎస్‌ఏపీడీ విఠల్‌నాయక్ 8309896289, పీఈటీ సం గ్రాంలను సంప్రదించాలని కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...