నాణ్యమైన విద్యను బోధించాలి


Fri,August 16, 2019 10:51 PM

-మండల విద్యాధికారి మారుతీరాథోడ్
న్యాల్‌కల్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ అన్నారు. శుక్రవారం న్యా ల్‌కల్‌లోని కస్తూర్బా గాంధీ బాలకల గురుకల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న తీరుతో పాటు ఎల్‌ఆర్‌త్రీ, ఎఫ్‌ఏ-1 పరీక్షల ఫలితాలపై ఆరా తీశా రు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. మెనూ ప్ర కారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంత రం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పుస్తకాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...