విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తాం


Fri,August 16, 2019 10:51 PM

కోహీర్ : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని జహీరాబాద్ పీహెచ్‌సీ వైద్యాధికారులు డా.ఇమ్రా న్, డా.సర్ఫనాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని బిలాల్‌పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులున్న 8 నుంచి 20 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందజేస్తామని అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి దవాఖానలో విద్యార్థులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. హెచ్‌ఎం రాఘవులు, దవాఖాన సిబ్బంది సనా, విద్యార్థులున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...