రక్షాబంధన్‌లాగే వృక్షాబంధన్‌ను ఆచరించాలి


Thu,August 15, 2019 10:56 PM

-ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: సోదర సోదరీమణుల ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రక్షాబంధన్ మాదిరిగానే వృక్షాబంధన్‌ను ఆచరించిన పక్షంలో సీఎం కేసీఆర్ సంకల్పం వందశాతం సాకారమవుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్‌లోని జూనియర్ కళాశాలలో వృక్షాబంధన్ పేరిట ఎమ్మెల్యే చెట్లకు రాఖీలు కట్టిన సందర్భంగా మాట్లాడతూ అన్న తనకు రక్షణగా ఉండాలని చెల్లెళ్లు రాఖీ కడుతుందో అదే విధంగా చెట్లను తాము రక్షిస్తామని సంకల్పించి వృక్షాబంధన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్‌ను అభినందించారు. ఇదిలా ఉంటే జూకల్ శివారులోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఏఎంసీ చైర్మన్ సువర్ణషెట్కార్, వైస్ చైర్మన్ ఎం.ఏ.బాసిత్, ఆత్మ చైర్మన్ రాంసింగ్‌తో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. తుర్కపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రవంతి పరమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

పోతులబొగుడలో వృక్షాబంధన్
వట్‌పల్లి: హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు గతేడాది నాటిన మొక్కలకు గురువారం వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పోతులబొగుడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నీరజ తెలిపారు. పాఠశాల ఆవరణలో మూడు సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అదేవిధంగా నిర్జేప్లలో పాఠశాల విద్యార్థులకు పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగరాజు, నాయకులు గోపాల్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...