మద్యపానం నిషేధిస్తూ తీర్మానం


Thu,August 15, 2019 10:56 PM

హత్నూర: మండల పరిధిలోని గోవిందరాజుపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా గ్రామస్తులు ముందడుగు వేశారు. బుధవారం గ్రామ సభ నిర్వహించి గ్రామంలో మద్యపానం అరికట్టాలని పాలక వర్గం సభ్యులు తీర్మాణం చేశారు. అదే విధంగా గురువారం స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం గ్రామంలో పూర్తిగా మద్యపానం అరికట్టాలని తీర్మానించారు. అదే విధంగా గ్రామంలోని మహిళా సంఘల సభ్యులు గ్రామంలో మద్యపానాన్ని నిషేధించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎవరైనా అక్రమంగా బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేపడితే అడ్డుకోవడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాగా గ్రామంలో మద్యపానం నిషేధిస్తూ చేసిన తీర్మానాన్ని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అందచేయనున్నట్లు పేర్కొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...