పోలీసుల అదుపులో బ్యాంక్ చోరీ నిందితులు


Thu,August 15, 2019 10:56 PM

-కేసులో ఉపయోగపడిన సీసీ టీవీ పుటేజీలు
వట్‌పల్లి: గత నెల 8న వట్‌పల్లి ఏపీజీవీబీ బ్యాంక్‌లో మహిళ చూపు మరల్చి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8వ తేదీన బ్యాంక్‌లో నగదు జమ చేయడానికి వచ్చిన గొర్రెకల్‌కు చెందిన మహిళతో మాటలు కలిపిన ఇద్దకు వ్యక్తులు రూ.17,500 నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వట్‌పల్లి పోలీసులు బ్యాంక్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అనంతరం వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టగా గత వారం జోగిపేట పోలీసులకు జాఫర్ అనే నిందితుడు పట్టుబడగా మరో నిందితుడు నవాబ్‌కోసం మహారాష్ట్రలో గాలింపు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో చోరీ జరిగిన 40 రోజుల్లోనే నిందితులను పట్టుకోవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మోహన్‌రెడ్డి మాట్లాడు తూ బ్యాంక్‌లో మహిళను మోసగించి డబ్బులు ఎత్తుకెళ్లిన నిందితులును పట్టుకునేందుకు సిబ్బంది ఎంతో శ్రమించారని తెలిపారు. వారిని పట్టుకోవడంలో బ్యాంక్‌లో రికార్డు అయిన సీసీ పుటేజీలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు అమర్చుకుంటే ఎలాంటి దొంగతనాలు జరుగవన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...