ఘనంగా రక్షా బంధన్


Thu,August 15, 2019 10:53 PM

అందోల్, నమస్తే తెలంగాణ/ రూరల్/ రాయికోడ్/ మునిపల్లి/ వట్‌పల్లి/ హత్నూర/ పుల్కల్: అన్నాచెల్లెళ్ల... అక్కాతమ్ముళ్ల... అనుబంధానికి, ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను గురువారం అందోలు నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అందోలు, పుల్కల్, వట్‌పల్లి, రాయికోడ్, మునిపల్లి, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల పరిధిలోని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి పండుగను వైభవంగా జరుపుకున్నారు. అక్కా...చెల్లెళ్లు వారి సోదరులకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించి, మంగళ హారతులు ఇచ్చి వారి ప్రేమను చాటుకున్నారు.

జోగిపేట తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులు, సిబ్బంది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు రాఖీ కట్టారు. జోగిపేటకు వచ్చిన సినీనటి ఉమాదేవి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు రాఖీని కట్టారు. నాకు నువ్వు రక్షా...నీకు నేను రక్షా.. మనమిద్దరం దేశానికి రక్షా హిందూ సంఘాల సభ్యులు ప్రజలతో పాటు జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణం, జాగృతి నాయకులు నాగరాజ్, మారుతి, నరేశ్ రాఖీలు కట్టారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...