అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన..


Wed,August 14, 2019 10:44 PM

బొల్లారం : విద్యార్థుల భవిష్యత్ తిర్చిదిద్దేందుకు పరిశ్రమలు ముందుకు రావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్‌లో మైలాన్ పరిశ్ర మ వారు రూ.95 లక్షలతో అదనపు గదుల నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైన అదనపు గదు ల నిర్మాణ పనులను ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుల కోసం మోడల్ స్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి చేయూతనిచ్చిన మైలాన్ పరిశ్రమను ఆయన అభినందించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరిన్ని పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. విద్యార్థులు సాయం అందించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నా రు. కాగా అంతకుముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశ్రమ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి పరిశ్రమలు తోడ్పాటు అందించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు చంద్రారెడ్డి, మైలాన్ పరిశ్రమ ప్రతినిధులు మల్లిఖార్జున్‌రావు, చంద్రశేఖర్, సత్యనారాయణ, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రేమలత, ఉపాధ్యాయులు తదిరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...