హరితహారంలో భాగస్వాములు కావాలిహరితహారంలో భాగస్వాములు కావాలి


Wed,August 14, 2019 10:43 PM

అమీన్‌పూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అమీన్‌పూర్ మండల పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున గోశాలలో ఆయన గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి గోవులంటే ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడినన్నారు.

తాను వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని గుర్తు చేసుకున్నారు. అందువల్ల తనకు గోవులతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. హిందువులు తమ సంప్రదాయం ప్రకారం గోమాతలకు పూజలు చేయడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతలను పూజిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. అంతకు ముందు ఆయన గోశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహ్మాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, యూనుస్, సత్యనారాయణగౌడ్, గోశాల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...