పాశమైలారంలో పోలీసుల కార్డెన్ సెర్చ్


Wed,August 14, 2019 10:40 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ/పటాన్‌చెరు రూరల్ : మండలంలోని బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 39 బైకులు, 5 ఆటోలు, 1 కారుతో పాటు 149 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే.. పటాన్‌చెరు ప్రాంతంలోని పాశమైలారం ఇప్పటికే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది.

ఇక్కడ అనేక పరిశ్రమలు ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రజలు జీవనోపాధి కోసం ఇక్కడి పరిశ్రమల్లో పనిచేసేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో నేరస్థులు సైతం ఇక్కడి ప్రాంతాల్లో నివాసముంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. స్థానికేతరులకు ఇండ్లను అద్దెకు ఇచ్చే క్రమంలో వారి నుంచి ఐడీ కార్డు, అడ్రస్ ఫ్రూఫ్‌లను తప్పనిసరిగా తీసుకోవాలని స్థానికులకు సూచించారు. తనీఖీల్లో డీఎస్పీ రాజేశ్వర్‌రావు, స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డితో పాటు 15 మంది సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, 10 మంది ఏఎస్‌ఐలు, 57 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...