ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆదర్శనీయం


Wed,August 14, 2019 10:40 PM

రామచంద్రాపురం : మహాత్మా గాంధీ దేశానికే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్‌లోని మ్యాక్ సొసైటీలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు గాంధీజి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని కాలనీ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి సొంత ఖర్చుతో గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుధవారం గాంధీజి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ చేసిన కృషిని దేశ ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంజయ్యయాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుష్పానగేశ్, కాలనీ అధ్యక్షుడు పాపయ్యయాదవ్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు దేవేంద్రాచారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్, శివయ్య, యాదిరెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...