ఎస్సీ కార్పొరేషన్ నిధులను వినియోగించుకోవాలి


Wed,August 14, 2019 10:40 PM

-ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఈడీ బాబూరావు
రాయికోడ్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఈడీ బాబూరావు అన్నారు. బుధవారం రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2018-19 సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో సంగారెడ్డి జిల్లాకు 783 యూనిట్లకు రూ.50 వేల చొప్పున, 80 శాతం రాయితీపై 643 యూనిట్లు రూ.1లక్ష లబ్ధిదారులకు మంజూరి అయినట్లు ఆయన చెప్పారు.

ఇందులో రాయికోడ్ మండలంకు 21 యూనిట్లు రూ.50 వేలు మించకుండా 100 శాతం రాయితీతో మంజూరు చేశామన్నారు. ఎస్సీ మహిళలకు 25 షీ క్యాబ్ కార్లను 60 శాతం రాయితీపై ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 2019-20 సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీ యువతి, యువకులు వచ్చే నెలలో ఆన్‌లైన్‌లో వివిధ రకాల యూనిట్ల కోసం నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో స్టీవెన్‌నీల్, ఎంపీపీ సూపరింటెండెంట్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...