రెండు ఇండ్లల్లో దొంగతనం


Wed,August 14, 2019 10:39 PM

సంగారెడ్డి టౌన్ : పట్టణంలోని గురునగర్ కాలనీ, సదాశివ ఎన్‌క్లేవ్‌లో రెండు ఇండ్లలో దొంగతనం జరిగింది. సదాశివపేట ఎస్‌ఐ రవీందర్ కథనం ప్రకారం.. గురునగర్ కాలనీలో నివసిస్తున్న విజయ్‌కుమార్ తన కూతురుకు రాత్రి 10.00 గంటల సమయంలో కడుపు నొప్పి రాగా ఇంటికి తాళం వేసి సంగారెడ్డికి తీసుకెళ్లారని తెలిపారు. ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయన్నారు. బీరువా పగుల గొట్టి మూడు తులాల నెక్లెస్, మూడు తులాల చైన్, ఒక ఫోన్ దొంగలించడం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని అయోధ్య ఇంటిలో కూడా దొంగతనం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఇంటిలో ఉన్న బీరువాను పగుల గొట్టి 30తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...