రేపు సంగారెడ్డికి బండారు దత్తాత్రేయ


Wed,August 14, 2019 10:38 PM

సంగారెడ్డి టౌన్ : ఈనెల 16వ తేదీన సంగారెడ్డికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన సంగారెడ్డిలోని టీఎన్‌జీవో భవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసున్నట్లు తెలిపారు.

సమావేశానికి బండారు దత్తాత్రేయ హాజరవుతారని, అనంతరం మండలంలోని మంజీరా డ్యాంను సందర్శిస్తారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, విష్ణువర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మందుల నాగరాజు, అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నాయకులు నర్సారెడ్డి, శేఖర్, రాములు, వాసు, విఠల్‌గౌడ్, సునీల్, రమేశ్, శ్రీరాం వెంకట్, వపన్, మురళీధర్, ఈశ్వరి, లక్ష్మి, శివంగుల నాగరాజు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...