పచ్చని పటాన్‌చెరువే లక్ష్యం


Wed,August 14, 2019 12:15 AM

పటాన్‌చెరు రూరల్: పటాన్‌చెరు నియోజకవర్గంలో పచ్చదనాన్ని నింపడమే లక్ష్యంగా హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని 13 గ్రామాల్లో ఒకేరోజులో ఉదయం 8 గంటలు మొదలు మధ్యాహ్నాం 2 గంటల వరకు పెద్దఎత్తున ఆయా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిధిలోని రుద్రారం, లక్డారం, చిట్కుల్, ముత్తంగి, ఇస్నాపూర్, క్యాసారం, పాశమైలారం, పోచారం, బచ్చుగూడ, ఇంద్రేశం, ఐనోల్, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి హరితహారంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఐదో విడుత హరితహారంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని జిల్లాలోనే ముందుంచాలనే లక్ష్యంతో మొక్కలు నాటేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే పటాన్‌చెరు మండలంలోనే దాదాపు 6 గ్రామాల్లో హరితహారాన్ని ప్రారంభించి పెద్దఎత్తున మొక్కలను నాటించారు. మంగళవారం ఒక్క రోజులోనే 13 గ్రామాల్లో హరితహారాన్ని చేపట్టారు. గ్రామపంచాయతీకి 40వేల మొక్కలను లక్ష్యాన్ని నిర్దేశించి, లక్ష్యాన్ని చేరుకున్న గ్రామపంచాయతీకి నగదు పురస్కారాన్ని అందిస్తానని, నర్సరీల నుంచి గ్రామపంచాయతీలకు మొక్కలను రవాణా చేసేందుకు చార్జీలను తానే భరిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ధశరథ్‌రెడ్డి, బొర్రా వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో అనంత్‌రెడ్డి, రుద్రారంలో సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ముత్తంగిలో సర్పంచ్ ఉపేందర్, ఉపసర్పంచ్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్పశ్రీనివాస్, కుమార్‌గౌడ్, చిన్నకంజర్లలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, పెద్దకంజర్లలో సర్పంచ్ రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ హరిశంకర్‌గౌడ్, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, పాశమైలారంలో సర్పంచ్ పోచయ్య, ఉపసర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ సరిత, క్యాసారంలో సర్పంచ్ పెంటయ్య, ఉపసర్పంచ్ విక్రమ్‌రెడ్డి, ఎంపీటీసీ రామచందర్, ఐనోలులో సర్పంచ్ పద్మ, వెంకటేశ్, శంకర్‌రెడ్డి, మల్లికార్జున్, ఇంద్రేశంలో సర్పంచ్ దండు నర్సింహులు, ఉపసర్పంచ్ శివకుమార్‌గౌడ్, ఎంపీటీసీ మణేమ్మ తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...