చెట్లే మనకు జీవనాధారం


Wed,August 14, 2019 12:15 AM

సిర్గాపూర్: చెట్లు మనకు ప్రాణవాయువు, అవే మనకు జీవనాధారమని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వాసర్ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కలిసి స్థానిక జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నీళ్లు పోసి పెంచిన మొక్క పెద్దదై జీవకోటి మనుగడకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఇంటికి మొక్కలు నాటి, సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లు ఉంటేనే పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, వర్షాలు ఉంటేనే పంటలు పండుతాయన్నారు. గ్రామాల్లో వర్షం నీరు నిలబడేలా ఇంకుడు గుంతలు తవ్వాలి. వృథా నీటిని, ఇంట్లో మనం వాడే నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించాలన్నారు. వాసర్ పరిధిలోని అన్ని గిరిజన తండాలకు బీటీ రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దశలవారీగా అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి పరుస్తానని, ఇచ్చిన మాటలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోర్డినేటర్ వెంకట్‌రాంరెడ్డి, ఆత్మ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంఆర్‌ఐ శ్రీనివాస్, ఆత్మ డైరెక్టర్ అరుణదేవేందర్, సర్పంచ్ జ్ఞానుబాయి, ఎంపీటీసీ లక్ష్మీబాయి, తండాల సర్పంచ్‌లు భారతి, సంతోషి, జగ్గునాయక్, ప్రముఖ న్యాయవాది అనంతరావుకులకర్ణి, విశ్రాంత కార్యదర్శి రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సంజీవరావు, నాయకులు దేవేందర్, రఫియోద్దీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...