ఊరురా హరితహారం


Wed,August 14, 2019 12:14 AM

వట్‌పల్లి: మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారిణి మాణెమ్మ సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని మంచిర్యాలతండా, ఖాదీరాబాద్ గ్రామాల్లో విద్యార్థులు, స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు భారీగా మొక్కలు నాటి మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలబెట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన రహదారులపై, పొలంగట్లపై మొక్కలు నాటాలన్నారు. మొక్కలు పెరిగితేనే వాతావరణంలో వాయుకాలుష్యం తగ్గి మానవాళికి స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అపర్ణాశ్రీకాంత్, ఎంపీడీవో రఘు, సర్పంచ్‌లు స్వర్ణలతారెడ్డి, దీప్లానాయక్, హెచ్‌ఎం వకులాదేవి, పంచాయతీ కార్యదర్శి రాజలింగం, ఉపాధి సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

పుల్కల్‌లో..
పుల్కల్: హరితహారం కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని ఎంపీపీ చైతన్యరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సుల్తాన్‌పూర్, ఉన్నాపూర్ గ్రామాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మొక్కలు నాటి మహిళలకు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, సర్పంచ్ మాణయ్య, టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు దర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్: మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని, మొక్కలు నాటి కాపాడితేనే చెట్లుగా ఎదిగి పండ్లు ఫలాలు అందిస్తాయని ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జంబ్గి(కె) గ్రామా శివారులోని రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్ మాట్లాడుతూ ... గ్రామాలన్నింటినీ హరిత వనాలుగా తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, ఎంపీటీసీ కృష్ణ, ఎంపీడీవో స్టీవేన్‌నీల్, ఉపాధిహామీ మండల అధికారి గురుపాదం, మాజీ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్, శ్యామ్, విఠల్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిన్నచెల్మెగ గ్రామ సర్పంచ్ విజయ్‌భాస్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి చెట్లుగా ఎదిగే వరకు కాపాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చిన్నచెల్మెడ గ్రామాన్ని పచ్చని హరితవనంలా తయారు చేయాలని సూచించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...