త్యాగల స్మరణలో


Mon,August 12, 2019 10:32 PM

-భక్తిశ్రద్ధలతో బక్రీద్
-ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
-ఖుర్భాణీ పంపిణీ
-పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
-ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్

సంగారెడ్డి టౌన్:త్యాగనిరతికి ప్రతీక అయిన బక్రీద్‌ను జిల్లాలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. సోమవారం ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఖుర్భాణీ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దలను స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పూలుచల్లి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు పలువురు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌కు స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. - సంగారెడ్డి టౌన్

జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకొన్నారు. ఉదయమే కొత్త బట్టలు దరించి ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు ముగిసిన తరువాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ముస్లింలు ఉండడంతో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చిట్కుల్, అమీన్‌పూర్‌లో ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు.

అదేవిధంగా జహీరాబార్‌లో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ఈద్గాల్లో ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు ఎమ్మెల్సీ, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డిలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పలువురు ముస్లిం మత పెద్దల ఇండ్ల వద్దకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరిగింది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...