మాలలు ఐక్యంగా ఉద్యమించాలి


Mon,August 12, 2019 10:23 PM

-మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
సంగారెడ్డి టౌన్ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. సోమవారం మాల మహానాడు జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి.జనార్దన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హాజరై మాట్లాడుతూ మాలలందరూ ఐక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాల మహానాడును గ్రామస్థాయి, మండల స్థాయిలో కమిటీలు వేయాలని సూచించారు. మాలలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేయూత ఇవ్వాలని కోరారు. జిల్లావ్యాప్తంగా మాల మహానాడు సభ్యత్వాన్ని పెంచాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.జాన్‌పాల్, నాయకులు విజయ్‌కుమార్, బక్కన్న, గోపయ్య, మల్లేశం, మురళీ, దుర్గప్రసాద్, పద్మారావు, శివరాములు, ఈశ్వరయ్య, వంశికృష్ణ, అనంతరామ్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...