సీజనల్ వ్యాధులపై కళాజాత


Mon,August 12, 2019 10:22 PM

హత్నూర : వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై సోమవారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సం స్కృతి సారధి బృందం పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముచ్చర్లలో పారిశుధ్యం, బాలకార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు సీజనల్ వ్యాధులపై ఆటాపాటలతో వివరించారు. బడీడు పిల్లలను బడుల్లో చేర్పించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కిషన్‌రావు, నాయకులు యాదగిరి, కార్యదర్శి రాణిహంసలేఖ కళాకారులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...