మండల వ్యాప్తంగా 7.68 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం


Mon,August 12, 2019 10:21 PM

అందోల్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు-హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో 7.68 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం పెట్టుకున్నట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. సోమవారం మండల వ్యాప్తంగా గ్రామాల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన డాకూర్, పోసానిపేట గ్రామాలను ఎంపీపీ బాలయ్యతో కలిసి సందర్శించి, డాకూర్‌లోని దర్గా ఆవరణలో 200 మొక్కలను నాటారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ మొక్కలను నాటడం, వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను మనందరం తీసుకోవాలన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా మొక్కలను నాటేందుకు 3 లక్షల వరకు గుంతలను తీయడం జరిగిందని, వీటిలో 1.75 లక్షల వరకు మొక్కలను నాటినట్లు చెప్పారు. ఇంటింటికీ 98 వేల మొక్కలను పంపిణీ చేయాల్సి ఉండగా, పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. రోడ్డుకు ఇరువైపులా మండల వ్యాప్తంగా 27,200 మొక్కలను నాటాలని, ఈ మొక్కలను సంరక్షణ కోసం 27,200 ట్రీ గార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నదని, ఇప్పటి వరకు 7 వేల వరకు ట్రీ గార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ శ్రీనివాస్ రావు, ఏపీవో అర్చనతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...