కేతకీ మొగులి వనంలో భక్తుల కోలాహలం


Mon,August 12, 2019 10:21 PM

ఝరాసంగం :దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. అమృత గుండంలో పుణ్యస్నానాలు చేశారు. కేతకీ ఆలయ ప్రాగణంలో భక్తులు స్వామివారి స్మరించుకుంటూ భక్తి భజన కీర్తనలు చేశారు. బీదర్‌కు చెందిన శివసాయి సూపర్ మార్కెట్ బృందం సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ నరసింహాగౌడ్, కార్యనిర్వహణాధికారి మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు, పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...