రెండు బైక్‌లు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు


Mon,August 12, 2019 10:20 PM

పుల్కల్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. జోగిపేటకు చెందిన దుర్గారాం(60), సొంత పనుల నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో దుర్గారాం బైక్ పైనుంచి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. .108 వాహనంలో సంగారెడ్డి దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద నగదు రూ.4,500, బంగారు ఉంగరాన్ని తీసి అంబులెన్స్ ఈఎంటీ కమలాకర్ కుటుంబ సభ్యులకు అందజేశాడు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...