నాగార్జున్ సాగర్‌లో జహీరాబాద్ వ్యక్తి గల్లంతు


Mon,August 12, 2019 10:20 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌కు చెందిన నరసింహ(41), తన మిత్రులతో కలిసి నల్లగొండ జిల్లాలోని నాగార్జున్‌సాగర్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి నరసింహ తన మిత్రులతో కలిసి కారులో నాగార్జున్ సాగర్‌కు వెళ్లినట్లు స్నేహితులు తెలిపారు. నాగార్జున్ సాగర్ డ్యాం వద్ద ఉన్న శివాలయం ఘాట్ వద్ద ఈతకు వెళ్లి గల్లంతు అయినట్లు పేర్కొన్నారు. శ్రీశైలం వైపు నుంచి భారీ వరద నీరు రావడంతో అధికారులు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం పెరిగి గల్లంతు అయినట్లు వారు చెప్పారు. నరసింహ నీటిలో గల్లంతు కావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...