కలివేములలో రోడ్లకు మరమ్మతులు


Sun,August 11, 2019 11:11 PM

కంది : మండల పరిధిలోని కలివేముల గ్రామంలో వర్షంతో గుంతలు పడిన అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేశారు. ఆదివారం స్థానిక సర్పంచ్ బక్కి బంధమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో వర్షం కారణంగా గుంతలమయమై, బురదతో ఉన్న రోడ్లపై మట్టి పోసి మరమ్మతులు చేయించారు. అలాగే గ్రామంలోని తాగునీటి పైపులైన్ లీకేజీ కావడంతో వాల్వ్‌లను బింగింపజేసి తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురు కాకుండా వారికి తగిన న్యాయం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ విక్రంరెడ్డి, సెక్రెటరీ యూనస్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...