బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం


Sun,August 11, 2019 11:11 PM

సంగారెడ్డి టౌన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఆదివారం జహీరాబాద్‌లో నిర్వహించిన ఆత్మ గౌరవ సభకు వెళ్తున్న ఆయనకు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, దళితమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం జగన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు శాలువా కప్పి సన్మానించి తులసి మొక్కను బహుకరించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, రాములు, వెంకట్‌నర్సింహారెడ్డి, కులకర్ణి, రాజేశ్వర్‌రావు, పవన్, నాగరాజు, వేణుమాధవ్, వాసు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...