అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి


Sun,August 11, 2019 11:10 PM

కొండాపూర్ : మండల పరిధిలోని చెర్లగోపులారంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడేనికి చెందిన పండల విఠలయ్య(52) తన కూతురు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.కాగా, ఆదివారం మధ్యాహ్నం కల్లు దుకాణంలో కల్లు తాగుతుండగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు మృతిడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...