ఎల్లారానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటుచేయాలి


Sun,August 11, 2019 11:10 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : మండలంలోని ఎల్లారం గ్రామంలో గ్రామస్తుల వినతి మేరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఆత్మకూర్ నగేష్ కోరారు. శనివారం సాయంత్రం గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు అస్థవ్యస్తంగా ఉండడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామం నుంచి వాగుదాటి బయటకు వెళ్లాలన్నా ఒకే దారి ఉండడంతో వర్షకాలంలో ప్రజల అవస్థలు వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని నగేష్ కోరారు. ఆయన వెంట గ్రామస్తులు మాణిక్యం, నాగిశెట్టి, బస్వరాజ్, విఠల్, ఉమాకాంత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...