ఆలయాల్లో పౌర్ణమి, ఏకాదశి పూజలు


Sun,August 11, 2019 11:10 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జోగిపేటలోని వీరహనుమాన్ దేవాలయంలో ఆదివారం శ్రావణ పౌర్ణమి ఏకాదశి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 18 ఆధ్యాయాలను పఠనం చేసి, పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జోగిపేట పట్టణానికి చెందిన మన్‌సాన్‌పల్లి మల్లికార్జున్ దంపతులు యజ్ఞం నిర్వహించారు. జోగిపేట పురోహితులు రమణశర్మ, దత్తుశర్మ పూజా కార్యక్రమాలను వేద మంత్రోశ్ఛరణలతో యజ్ఞపూజలను నిర్వహించారు. పూజ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు భారీగా రాగా వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో చండూర్, రాంసానిపల్లి, పోచారం గ్రామాలకు చెందిన భక్త మండలి సభ్యులు అనంత కిషన్, సాంబశివుడు, రాంరెడ్డి, కృష్ణ, వీరహనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు పురం లక్ష్మణ్, శ్రీను పాల్గొన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్: రాయికోడ్ భద్రకాళీ సమేత వీరభద్రశ్వరస్వామి ఆలయంలో శ్రావణశోభతోపాటు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. ఆదివారం శ్రావణ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ఉదయం నుంచి స్వామి వారికి అభిషేకాలు, భద్రకాళీ అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అలాగే శ్రావణ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆర్చకులు ఈశ్వరయ్యస్వామి, బస్వరాజుస్వామి వేద మంత్రాలతో సాముహిక రుద్రాభిషేకాలు చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...