విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి


Sun,August 11, 2019 11:10 PM

అందోల్, నమస్తే తెలంగాణ: మండల పరిధిలోని తలెల్మా గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రాములు, స్వర్ణలత కుమారుడు నితిన్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం తండ్రి ఇంట్లో లేకపోవడంతో నీటి కోసం బోరు మోటరును ఆన్‌చేయమని తల్లి తెలుపడంతో నితిన్ స్వీచ్‌లో కనెక్షన్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారి విద్యుత్ షాక్‌తో మురికి కాలువలో పడిపోయాడు. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కొడుకుని చూసిన తల్లి బోరున విలపించింది. సాయంత్రం గ్రామంలో అంతక్రియలు నిర్వహించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...