పద్మశాలీల వివాహ పరిచయ వేదిక


Sun,August 11, 2019 11:09 PM

సంగారెడ్డి టౌన్ : పద్మశాలీ వివాహ పరిచయ వేదికకు 120జంటలు హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని వైఎంఆర్ గార్డెన్ పద్మశాలీ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలీ వధూవరుల ఆత్మీయ పరిచయ వేదికను నిర్వహించారు. ఈ పరిచయ వేదికలో జిల్లా వ్యాప్తంగా 120జంటలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమృతం రాంచందర్ మాట్లాడుతూ పద్మశాలీ వివాహ పరిచయ వేదిక ద్వారా వివాహాలు జరుపనున్నట్లు తెలిపారు. పద్మశాలీ కుటుంబాల మధ్య సానిహిత్యం పెంచడంతోపాటు పెండ్లీ వయస్సుకు వచ్చిన యువతీయువకులకు వివాహాలు జరిపించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం అంజయ్య, బొమ్మ అశోక్‌నేత, జిల్లా అధ్యక్షుడు గుడ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి వెంకట హరిహరకిషన్, నాయకులు గోలి యాదగిరి, రుమాండ్ల రాజు, పడాల జగదీశ్వర్, కొడపాక యాదగిరి, మున్న శ్యాంరావు, మునిపల్లి వీరన్న పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...