ఇండ్ల మధ్యలో సెల్ టవర్లను తొలగించాలి


Sun,August 11, 2019 11:09 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : కాలనీల్లోని ఇండ్ల మధ్యలో ప్రైవేట్ భవనాలపై ఏర్పాటుచేసిన సెల్ టవర్లను తొలగించాలని స్థానికులతో కలిసి ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రశాంత్‌నగర్, విజయనగర్ కాలనీల్లో ఓ ప్రైవేట్ సెల్ కంపెనీకి చెందిన టవర్లును తొలగించాలని కోరారు. సెల్ టవర్ల ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ ఆరోపించారు. ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటి తరంగాలతో గర్భిణులకు, పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

టవర్లుతో ప్రమాదం పొంచి ఉందని, కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి సెల్ టవర్ల ఏర్పాటును నిలిపేయాలని శ్రీధర్ మహేంద్ర కోరారు. అధికారులను కోరారు. స్థానిక కాలనీవాసుల ఆరోగ్యాలు, అభిప్రాయాలు తీసుకోకుండా చేస్తున్న టవర్లను నిలిపివేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఎండీ నిజామొద్దీన్, రశీద్, ఫరూక్ అలీ, నాయకులు శ్రీకాంత్, శశికాంత్ కాలనీవాసులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...