నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి


Sat,August 10, 2019 11:30 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ: హరితహారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శనివారం మండలంలోని అనెగుంట, గోవింద్‌పూర్ శివారులో హరితహారంలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను ప్రజలు, అధికారులు బాధ్యత తీసుకుని కాపాడుకోవాలన్నారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈత వనలు పెంచేందుకు చెరువు కట్టపై మొక్కలు నాటుతుందన్నారు. వానలు అధికంగా కురువాలంటే ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. చెరువు కట్ట పై నాటిన ఈత మొక్కలు సంరక్షణ చేసేందుకు ఎక్సైజ్ సీఐ అశోక్‌కుమార్ ఒక కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగించాలన్నారు.

చెట్లు లేక పర్యావరణంలో మార్పులు: ఎమ్మెల్సీ
చెట్లు లేక పర్యావరణంలో మార్పులు వచ్చి, వానలు కురువడం లేదని ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ అన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు అధికారులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. మొక్కలు సంరక్షణ కోసం ప్రభుత్వం డబ్బులు సైతం ఇస్తుందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఈత వనలు పెంచేందుకు ఎక్సైజ్ అధికారులు ముందు రావడం...వాటిని కాపాడేందుకు గీత కార్మికులు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్‌కుమార్, ఎంపీడీవో రాములు, ఎక్సైజ్ ఎస్‌ఐలు రాణి, సుధాకర్, ఎంపీటీసీలు ఎంజీ.రాములు, తట్టు అరుణజ్యోతి నారాయణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తాజోద్దీన్, ఉపాధి హామీ ఏపీవో అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...