ముగిసిన జాతిరత్నాలు సినిమా షూటింగ్


Sat,August 10, 2019 11:30 PM

అందోల్, నమస్తే తెలంగాణ: వైజయంతి మూవీస్ నిర్మాణంలో చేపడుతున్న జాతిరత్నాలు సినిమా షూటింగ్ జోగిపేటలో శనివారం నాటికి ముగిసింది. రెండు రోజులుగా స్థానిక క్లాక్ టవర్, వీరహనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. సినిమా డైరెక్టర్ కేవీ.అనుదీప్ క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. హిరోలు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో క్లాక్ టవర్ ప్రాంతంలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

స్థానికంగా ఉన్నవారిని సైతం సినిమా షూటింగ్‌లో భాగస్వాములను చేసి, కొన్ని సన్నివేశాలను వారిపై చిత్రీకరించారు. పల్లె, పట్టణ వాతావరణంలో చిత్ర షూటింగ్ చేయాల్సి ఉండగా, జోగిపేట పట్టణాన్ని ఎంపిక చేసుకున్నామని డైరెక్టర్ కేవీ.అనుదీప్ తెలిపారు. సినిమా షూటింగ్ ముగియనుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు షూటింగ్ ప్రాంతానికి చేరుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...